PEDDAPALLY | కాల్వ శ్రీరాంపూర్. ఏప్రిల్ 18 : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్లను అంకంపల్లిలో అతిగించగా కొందరు పనిగట్టుకుని చింపారని, చింపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఆకుల స్వామి వివేక్ పటేల్ డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వాల్ పోస్టర్లు చింపివేసిన ఘటనపై కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు త్వరగా నిందితులను పట్టుకొని చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా BRS పార్టీ రజతోత్సవ వరంగల్ సభను ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఈ కార్యక్రమంలో అంకంపల్లి గ్రామ అధ్యక్షులు జాగిలపు నర్సింగం, మాజీ ఏఎంసీ డైరెక్టర్ నాంసాని నాగరాజు యాదవ్, అంకంపల్లి గ్రామ ఉపాధ్యక్షులు ఆకుల మల్లయ్య, సీనియర్ నాయకులు గట్టు సంపత్, సతీష్ , కాంచన శ్రీనివాస్ , స్వామి తదితరులు పాల్గొన్నారు.