సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల ( Siricilla ) పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కారు( Car) ఆటోమేటిక్ లాక్ అవ్వడంతో చిన్నారి అరగంట పాటు కారులోనే బందీ అయ్యాడు. తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్కు చెందిన విష్ణు అనే వ్యక్తి సమీపంలో కారు నిలిపి పాల ప్యాకెట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో విష్ణు కొడుకు కారులోనే ఉన్నాడు. కొద్దిసేపటికి కారు ఆటోమేటిక్ కి లాక్ అవడంతో చిన్నారి కారులోనే అరగంట పాటు ఉండిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు ఒకరు కారు అద్దాలను కిందికి దించి లాక్ ఓపెన్ చేశారు. దీంతో అప్పటివరకు టెన్షన్ కు గురైన తండ్రి విష్ణు ఊపిరి పీల్చుకున్నాడు.