Organ Donation | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 22 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన కోట రాజగోపాల్ రెడ్డి (74) సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శరీర దానానికి అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు అభినందన పత్రం అందజేసి, కృతజ్ఞతలు తెలిపారు.
తొగర్రాయి కోట రాజగోపాల్ రెడ్డి (74) ఇంటికి సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మేరుగు భీష్మాచారి శనివారం వెళ్లి కలిశారు. తన మరణానంతరం అవయవ శరీర దానం చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. వారి సదాశయానికి ఆహ్వానిస్తూ సంబంధ పత్రాలపై సంతకాలు చేయించి, రాజగోపాల్ కి ఐడీ కార్డ్, అభినందన పత్రాన్ని మహేందర్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, మల్లేశం, సారంగం, శంకర్, వెంకటేశ్వర్లు, రాం నారాయణ, నవీన్, సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణా రెడ్డి, ముఖ్య సలహాదారులు రమేష్, ప్రచార కార్యదర్శి వాసు, జిల్లా గౌరవ అధ్యక్షుడు చంద్రమౌళి కృతజ్ఞతలు తెలిపారు.