ACB Trap | అంతర్గాం : రైతు నుండి రూ.10వేల లంచం తీసుకుంటూ ఓ ఆర్ఐ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన అంతర్గాం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. అంతర్గాం మండలం రాయదండి గ్రామానికి చెందిన వెంకట స్వామి అనే రైతు తన ఐదెకరాల భూమి
ఇతరుల పేరు మీద ధరణిలో నమోదు కావడంతో ఎంక్వయిరీ చేయించాలని ఆర్ఐ శ్రీమాన్‌ను సంప్రదించారు. ఎంక్వైరీ చేసేందుకు ఆర్ఐ రూ.10వేలు డిమాండ్ చేశాడు.
దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా గురువారం అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో రైతు వెంకట స్వామి నుండి రూ.10 పదివేలు తీసుకునే క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. విచారణ అనంతరం RI శ్రీమాన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.