వేములవాడ రూరల్, డిసెంబర్ 19 : అనుపురం, రుద్రవరం, సంకెపల్లికి చెందిన ముంపు గ్రామాల నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన దాదాపు 5 కోట్ల ఇంటి పరిహారం చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు. వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 14 మంది అనుపురం గ్రామస్తులు, 44 మంది రుద్రవరం గ్రామస్తులు, ఇద్దరు సంకెపల్లి గ్రామస్తులకు చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడారు. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. ఆ తర్వాత విప్‌ను జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ ఆయనను ఘనంగా సన్మానించారు.