Murder | వెల్గటూర్, జూలై 17..వెల్గటూర్ మండల కేంద్రంలో పెద్ద వాగు బ్రిడ్జి దగ్గర నడిరోడ్డుపై యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేసి కోటిలింగాల రోడ్డుకు పాత వైన్స్ వెనకాలకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. వెల్గటూర్ మండలంలోని కిషన్ రావుపేట గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ (35) అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎన్నోసార్లు పంచాయతీలు, కేసులు అయినప్పటికీ వారిలో మార్పు రాలేదు. గురువారం ఉదయం మృతుడు అమ్మాయి ఇంటికి వెళ్లి గొడవ చేశాడని తెలిసింది.
ఈ క్రమంలో మృతుడి బంధువులు అతనిని వెంబడించి దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. సంఘటన స్థలానికి ధర్మపురి సీఐ రామ నరసింహారెడ్డి ఇతర పోలీసులు చేరుకొని పంచనామా నిర్వహించారు. హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.