Charlapalli | సారంగాపూర్, ఆగస్టు 2 : బీర్పూర్ మండలంలోని చర్లపల్లి గ్రామ రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు వాగు కాలువకు ఆటు ఇటు కర్రలతో వంతెన ఏర్పాటు చేసుకుని దాటుతున్నారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో రోళ్లవాగు ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు చేరుకుంది. ప్రాజెక్ట్‌కు షెటర్లు ఏర్పాటు చేయకపోవడంతో వరద నీరు కాలువల ద్వారా వాగుల్లోకి చేరడంతో శనివారం ప్రాజెక్ట్ సమీపంలోని చర్లపల్లి గ్రామ రైతులు వాగు కాలువ దాటి పొలాల్లోకి వెళ్లెందుకు ప్రత్యామ్నాయ మార్గం లేక కర్రలతో వంతెన తయారు చేసుకుని అవతలివైపు దాటుతున్నారు.
ఆదివారం కూడా వరద ప్రవాహం కొనసాగడంతో వంతెనపై నుండే అవతలి వైపు వెళ్తాన్నారు. అధికారులు ప్రాజెక్ట్‌కు షటర్లు బిటించి ఉంటే మాకి కష్టాలు వచ్చెవి కాదని అంతక ముందు ఇంతగా వరదలు పారేవి కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి త్వరగా గెట్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.