కాల్వశ్రీరాంపూర్, నవంబర్ 7 : నగదు ఇస్తానని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి 50 వేలు ఫోన్‌పే చేసి ఓ మహిళ మోసపోయింది. బాధితురాలి కథనం మేరకు.. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలోని శ్రీనివాస కిరాణా దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ‘అర్జెంట్ డబ్బులు అవసరం ఉంది. మీకు నగదు ఇస్త. ఒక నెంబర్‌కు ఫోన్ పే చేయండి’ అని నమ్మించాడు. దీంతో దుకాణంలోని మహిళ సదరు వ్యక్తికి ఫోన్ పే ద్వారా 50 వేలు పంపింది.
తర్వాత మరో30 వేలు ఫోన్ పే చేయాలని, అవి ఇవి కలిపి ఇస్తానని సదరు వ్యక్తి చెప్పడంతో తన లేవని చెప్పింది. తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరడంతో ఆ వ్యక్తి నుంచి సమాధానం రాలేదు. ఎంత అడిగినా డబ్బులు ఇవ్వలేదు. ఇదే సమయంలో గ్రామస్తులు అక్కడికి చేరుకొని నిలదీశారు. అయినా స్పందన లేకపోవడంతో అతన్ని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గుర్తు తెలియని వ్యక్తిని స్టేషన్‌కు తరలించారు. తర్వాత గ్రామస్తులు ఫోన్‌పే చేసిన నెంబర్‌కు ఫోన్ చేయగా బెట్టింగ్ కోసం డబ్బులు పంపించాడని, తాను ఇవ్వనని చెప్పి ఫోన్ కట్ చేశాడని తెలిపారు.