జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 24: అధిక ఆదాయానికి ఆశపడ్డ ఓ గృహిణి సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయింది. 1.78లక్షలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నది. ఆన్లైన్ యాప్‌లో పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలు పొందవచ్చని సెల్‌కు మెసేజ్ రావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన గృహిణి నమ్మింది.
పలు దఫాలుగా పెట్టుబడి పెట్టడంతో అధిక ఆదాయం వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల యాప్‌లో 1.78లక్షల పెట్టుబడి పెట్టింది. తర్వాత నిర్వాహకులు యాప్‌ను మూసివేయడంతో తాను మోసపోయానని గ్రహించింది. వెంటనే జగిత్యాల టౌన్ పోలీసులను ఆశ్రయించింది. పెద్ద ఎత్తున నగదు పోవడంతో బోరుమంటున్నది.