యైటింక్లయిన్ కాలనీ, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలవుతున్నాయని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గడప గడపకూ కేసీఆర్ సంక్షేమ ఫలాలు-ఇంటింటికీ చందరన్న పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శనివారం రాత్రి కాలనీలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం లో నిద్రించారు. ఆదివారం 15వ డివిజన్ భాస్కరరావు నగర్, తారక రామారావు నగర్, రాజీవ్ నగర్ తదితర కాలనీలను సందర్శించారు. ఇంటింటికీ వెళ్లి పలకరించారు. తన ఏరియాకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతున్నదన్నారు. సింగరేణి స్థలాల్లో పట్టాలు ఇప్పించడం కోసం తాను పలుమార్లు అసెంబ్లీలో లేవనెత్తి సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకళ్లానని, మంత్రి కేటీఆర్ సహకారంతో జీవో నం.76, 58 ద్వారా 2014కు ముందు నిర్మించుకున్న పలు ఇండ్లకు ఇప్పటికే స్థలాలు ఇప్పించానన్నారు.
భాస్కరరావు నగర్లో క్వార్టర్ల మధ్యన ఖాళీ స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న విషయంలో సమస్య తలెత్తుతుందని, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైపులైన్లు తదితర సౌకర్యాల కల్పనలో ఆ స్థలాన్ని వినియోగించుకునే విషయమై సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి స్వాధీనం చేయలేదన్నారు. అలాగే రూ.80లక్షలతో మండే మార్కెట్ లో ప్లాట్‌ఫాంలను నిర్మించామని, మరో రూ.80 లక్షలతో సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి 40 లక్షలు వెచ్చించేలా ఒప్పించామన్నారు. మౌలిక వసతుల కోసం ఇప్పటికే రూ.3 కోట్ల వరకు వెచ్చించామని, 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. తాను ఎన్నికల్లో ఇచ్చి న హామీలన్నీ నెరవేరుస్తున్నానన్నారు. కార్యక్రమంలో మేయర్ అనిల్‌కుమార్, కార్పొరేటర్లు శంకర్ నాయక్, బాదె అంజలి, సాగంటి శంకర్, తాళ్ల అమృతమ్మ, నాయకులు అడ్డాల రామస్వా మి, బొడ్డు రవీందర్, విజయ చంద్రశేఖర్, కొంగర రవీందర్, మల్లికార్జున్, సదయ్య, టీబీజీకేఎస్ నాయకులు ఐలి శ్రీనివాస్, వీరారెడ్డి, దశర థం, మున్సిపల్, సింగరేణి అధికారులు ఉన్నారు.