జగిత్యాల, సెప్టెంబర్ 1: వేతనాల పెంపుపై మహిళా సంఘాల సహాయకులు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. జగిత్యాల, మల్యాల, కొడిమ్యాల, కోరుట్ల, కథలాపూర్లో సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. వేతనం 5వేల నుంచి 8వేలకు పెంచి సముచిత గౌరవమిచ్చిన సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు. మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్న సీఎం సారుకు రుణపడి ఉంటామని చెప్పారు. మరింత ఉత్సాహంతో పనిచేసి అర్హులకు ప్రభుత్వ పథకాలు చేరవేస్తామని స్పష్టం చేశారు.