Accident | పెద్దపల్లి రూరల్ మే 02: సైకిల్‌పై రోడ్డు దాటుతున్న గ్రామ పంచాయతీ వర్కర్‌ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యేడేళ్ల నర్సయ్య(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సబ్బితం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం సబ్బితం వద్ద గ్రామపంచాయతీ వర్కర్ గా పని చేస్తున్న నర్సయ్య విధినిర్వహణలో భాగంగా పనులు చేసుకుని సైకిల్ పై రోడ్డు దాటుతున్నాడు.
కాగా పెద్దపల్లి నుంచి మంథని వైపు వేగంగా వెళ్తున్న ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో నర్సయ్యపైనుండి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న బసంత్ నగర్ ఎస్ఐ స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 25 ఏళ్లుగా గ్రామపంచాయతీలో వర్కర్ గా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందిన నర్సయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల పలువురు గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానిచి ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.