Jagityal | మల్లాపూర్, అక్టోబర్ 8: గల్ఫ్ దేశమైన దుబాయ్ లో మండలంలోని వాల్గొండ ఎస్టీ తండ గ్రామానికి చెందిన లకావత్ రమేష్ (40) అనే వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు, బందువులు బుధవారం తెలిపారు. రమేష్ గత కొంత కాలంగా జీవనోపాది నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో పనులు ముగించుకోని తన గదిలో ఉన్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చి అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య పద్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రమేష్ మృతదేహంను స్వగ్రామంకు త్వరగా తెప్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.