GodavariKhani | గోదావరిఖనిలో కిలో చికెన్ @ 400.. నెల రోజుల్లో రూ.150 పెరుగుదల
కోడి కొండెక్కి కూర్చుంది. చికెన్ ముక్క నోటికి అందనంటోంది. గోదావరిఖనిలో చికెన్ ధర అమాంతం పెరిగింది. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ.260 ఉండగా అదిప్పుడు రూ.400లకు ఎగబాకింది.
GodavariKhani | కోల్ సిటీ, మార్చి 23 : కోడి కొండెక్కి కూర్చుంది. చికెన్ ముక్క నోటికి అందనంటోంది. గోదావరిఖనిలో చికెన్ ధర అమాంతం పెరిగింది. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ.260 ఉండగా అదిప్పుడు రూ.400లకు ఎగబాకింది. నెల రోజుల్లోనే రూ.150 పెరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పెరిగిన ధరలతో కిలో చికెన్ కొనుగోలు చేసేవారు అర్ధ కిలో చికెన్ తీసుకొని సరిపెట్టుకోవాల్సి వస్తోంది. సాధారణంగా సామాన్యులు మటన్‌కు బదులు చికెన్ తింటుంటారు. కానీ, ఇప్పుడు చికెన్ కంటే మటనే నయమంటున్నారు. చికెన్ తినేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
రెస్టారెంట్లు, హోటళ్లలోనూ, వినియోగం తగ్గింది. ముక్క లేనిదే ముద్ద దిగదనుకొనే వారికి చికెన్ చిక్కనంటోంది. మున్సిపల్ ఎన్నికలు, సమ్మక్క జాతర, ఎల్లమ్మ, పోచమ్మ. బోనాలతో చికెన్ విరివిగా వినియోగించారు. కోళ్ల ఉత్పత్తి తగ్గడమే ప్రస్తుతం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. దీనితో చికెన్ సెంటర్లలో కూడా గిరాకీ గణనీయంగా తగ్గుముఖం పట్టింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

