ELLAREDDYPETA | ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ 9: తెల్లారితే రంజాన్ ఉండగా కొత్త బట్టలు తెచ్చుకునేందుకు వెళ్లిన నారాయణపూర్ కి చెందిన షేక్ అవేజ్ షేక్ అఫ్రొజ్ గత నెల 30న వెంకటాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆరో తేదీన హైదరాబాదులోని యశోద లో చికిత్స పొందు షేక్ అవీజ్ మృతిచెందాడు.
మూడు రోజులు గడవక ముందే అతనితో పాటు వెళ్లిన అప్రోజ్(18) కూడా బుధవారం చికిత్స పొందుతూ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందిన ఘటన నారాయణపూర్ లో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. రంజాన్ పండుగ ఉందని నారాయణపూర్ కు చెందిన అవీజ్, అప్రోజ్ ఒకే స్కూటీపై సిరిసిల్లకు షాపింగ్ చేసేందుకు బయలుదేరారు.
అదే సమయంలో వెంకటాపూర్ నుంచి వస్తున్న ఓ ఆటో స్కూటీని ఢీకొట్టగా అవీజ్ అప్రోజ్ తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అవీజ్ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాదులోని కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించారు. అవీజ్ ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే మండల కేంద్రంలోని ఓ హాస్పిటల్ అఫ్రొజ్ చికిత్స పొందుతూ ఉండగా మూడు రోజుల క్రితం పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం అఫ్రోజును హైదరాబాద్ తరలించారు.
చికిత్స పొందుతూ అప్రోజ్ కూడా మృతి చెందడంతో ఇరు కుటుంబాల సభ్యుల రోదనలు మిన్నంటాయి. మూడు రోజుల్లో ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.