కోరుట్ల, జూలై 29: నాలుగు నెలల బాలుడు అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 347 ఫ్లాష్ కార్డుల (పక్షులు, జంతువులు, కలర్స్, వివిధ దేశాల ప్లాగ్స్)ను ఆలవోకగా గుర్తుపట్టేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన డాక్టర్ కార్తీకేయన్ రాజు – స్రవంతి దంపతుల కొడుకు హన్విద్ కృష్ణ (నాలుగు నెలలు) 347 ఫ్లాష్ కార్డులను గుర్తు పడుతుండడంతో యంగెస్ట్ టూ ఐడెంటిటీ విభాగంలో నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేశారు.
జూలైలో 347 ఫ్లాష్ కార్డుల ఐడెంటీ వీడియోలను పరిశీలించిన నోబెల్ సంస్థ ప్రతినిధులు చిన్నారికి అవార్డును కేటాయించినట్టు తెలిపారు. చిన్న వయసులో తమ మనుమడు ఘనత సాధించడంపై కోరుట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్న శ్రీదేవి, భాస్కర్ రాజు దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.