మెట్పల్ల్లి, డిసెంబర్ 7 : జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన ఎలిగేటి శ్రీనివాస్, ఆయన కూతురు కావ్య ఇద్దరు ఒకేసారి ఎల్ఎల్బీ కోర్సు పూర్తి చేశారు. అంతే కాకుండా, తెలంగాణ బార్ కౌన్సిల్లో ఇద్దరు ఒకే రోజు శనివారం ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. 50 ఏళ్ల వయసున్న శ్రీనివాస్ మెట్పల్లి పట్టణంలో ఫ్లెక్సీ షాప్ నిర్వహిస్తూనే శాతవాహన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా తీసుకున్నారు. ఆయన కూతురు కావ్య న్యూఢిల్లీలోని సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందింది. కాగా, ఒకే సారి తండ్రీకూతురు న్యాయవాదులు కావడంతో పలువురు అభినందించారు.