Vemulawada | వేములవాడ, ఆగస్టు 28 : తనను రోజు సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చుతుండగా కులమతాల హద్దులు దాటి గత ఎనిమిదేళ్లుగా సోదరుడిగా భావించి ముస్లిం మైనార్టీ కి చెందిన ఆటో నిర్వాహకుడికి రాఖీ కట్టి అనుబంధాన్ని చాటారు. చందుర్తి మండలంలో గణిత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న నాగమణి కరీంనగర్ నుండి ప్రతీరోజు ప్రభుత్వ పాఠశాలకు ఫయాజ్‌కు చెందిన ఆటోలోనే వెళ్తోంది.
గడచిన 8 సంవత్సరాలుగా ప్రతీ రాఖీ పండగ రోజున తప్పనిసరిగా ఆమె మహమ్మద్ ఫయాజ్ కు రాఖీ కడుతు తన సోదర భావాన్ని చాటుకుంటున్నారు. పండగను కులమతాలకతీతంగా జరుపుకోవడమే కాకుండా గమ్యస్థానాన్ని కూడా సురక్షితంగా చేర్చుతున్న తరుణంలో ఫయాజ్ కు ఉపాధ్యాయురాలు నాగమణి కట్టిన రాఖీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వర్షం వ్యక్తం చేస్తున్నారు.