Vemulawada | వేములవాడ, ఆగస్టు 1 : వేములవాడ పట్టణంలోని శివ సాయి నగర్ కు చెందిన జవ్వాజి సంపత్ రవలీ దంపతుల రెండు కుమార్తె రిహాన్షి (8) ఏళ్ల వయసుకే నిండు నూరేళ్లు నిండాయి. రవళి-సంపత్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా రెండవ కుమార్తె రిహాన్షి సుమారు నాలుగేళ్ల వయసున్నప్పుడు ముక్కులో నుండి ద్రవం కారుతున్నట్లుగా గమనించి వైద్యులను సంప్రదించారు. ఏడాది తర్వాత బ్రెయిన్ లో ఒక రకమైన జబ్బు ఉందని తేలింది. దీంతో హైదరాబాదులోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య శస్త్ర చికిత్సలు అందించారు.
గడచిన మూడేళ్లుగా ఆరోగ్యంగా ఉందనుకున్న చిన్నారి ఒక్కసారిగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ అస్వస్థ గురై శుక్రవారం కోమాలోకి వెళ్లిందని బంధువులు తెలిపారు. కృత్రిమ శ్వాస ద్వారా వైద్య చికిత్స అందిస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున మృతి చెందిందని తెలిపారు. కూతురు ఆరోగ్యం కోసం ఆరాటపడిన దంపతులు లక్షలాది రూపాయలు వెచ్చించిన చివరికి ఆమె ప్రాణం కాపాడలేకపోయామంటూ దంపతులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. శనివారం వేములవాడలో ఆమె అంతక్రియలు నిర్వహించారు.