వేములవాడ/సిరిసిల్ల టౌన్/గాంధీ చౌక్/సిరిసిల్ల/గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట/ఇల్లంతకుంట/ ముస్తాబాద్/ వీర్న పల్లి/వేములవాడ రూరల్/ కోనరావుపేట/ రుద్రంగి/చందుర్తి, జనవరి 26: జిల్లా కేంద్రంలో శుక్రవారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గణతంత్ర వేడుకలను పట్టణంలోని రాజకీయ పార్టీలు, కుల, కార్మిక, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. గాంధీచౌక్‌లో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ కార్యాలయంలో చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అయాజ్, రచయితల సంఘం జిల్లా అ ధ్యక్షుడు ఎలగొండ రవి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూ రి ప్రవీణ్, సెస్ డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, దిడ్డి రమాదేవి పాల్గొన్నారు. ఆర్టీవో కొండల్రావు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా కోర్టులో జడ్జి ప్రేమలత, సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ, జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడి లక్ష్మణ్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తంగళ్లపల్లిలో ఎంపీడీవో లచ్చాలు,తహసీల్దార్ వెంకటలక్ష్మి జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ పడిగెల మానస, వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య, సర్పంచుల ఫోరం జిల్లా అధ్య క్షుడు మాట్ల మధు, మండలాధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెన్నమనేని వెంకట్రావు, సింగిల్‌విండో చైర్మన్లు బండి దేవదాస్‌గౌడ్, కోడూరి భాస్కర్‌గౌడ్, బీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, ప్యాక్స్ వైస్ చైర్మన్ ఎగు మామిడి వెంకటరమణారెడ్డి ఉన్నారు.
గంభీరావుపేటలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎంపీపీ వంగ కరుణ, తహసీల్దార్ భూపతి, ఎంపీడీవో శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ నారాయణరావు, ఎస్ఐ రామ్మోహన్, ఏఎంసీ చైర్మన్ హన్మంతరెడ్డి, సర్పంచ్ శ్రీధర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్ జెండాను ఆవిష్కరించారు.
ఎల్లారెడ్డిపేటలో ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ రామచంద్రం, ఏవో భూమ్‌రెడ్డి, సీఐ శశిధర్‌రెడ్డి, ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ గుం డారపు కృష్ణారెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఇక్కడ ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, వైస్ ఎంపీపీ భాస్కర్, సెస్ డైరెక్టర్ కృష్ణహరి పాల్గొన్నారు.
ఇల్లంతకుంటలో తహసీల్దార్ జావిద్ అక్బర్, ఎంపీవో మీర్జా, ఎస్ఐ దాస సుధాకర్, సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. గాలిపెల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ హరికృష్ణారెడ్డి రూ.6 వేల విలువైన బహుమతులు అందజేశారు.
ముస్తాబాద్‌లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్‌రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, తహసీల్దార్ గణేశ్, ఎంపీడీవో రమాదేవి, ఏవో వెంకటేశ్, ఎస్ఐ శేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు తన్నీరు బాపురావు, అన్నం రాజేందర్‌రెడ్డి, పోతుగల్ ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, పీహెచ్సీలో డాక్టర్ గీతాంజలి జాతీయ పథకాన్ని ఎగురవేశారు. వేడుకల్లో ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య పాల్గొన్నారు.
వీర్నపల్లిలో తహసీల్దార్ ఉమారాణి, ఎంపీడీవో నరేశ్‌కుమార్, ఎస్ఐ రమేశ్, ఏఎంసీ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, సెస్ డైరెక్టర్ మాడ్గుల మల్లేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక్కడ జడ్పీటీసీ గుగు లోత్ కళావతి, ఎంపీపీ మాలోత్ భూల, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ఎడ్ల సాగర్, నాయబ్ తహ సీల్దార్ ఎల్సాని ప్రవీణ్ ఉన్నారు.
వేములవాడలో న్యాయమూర్తి రవీందర్, మున్సిపల్ కమిషనర్ ఆన్వేశ్, రాజన్న ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ నాగే ంద్రాచారి, పట్టణ సీఐ కరుణాకర్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, ఎంపీ డీవోలు శ్రీధర్, రాంరెడ్డి, తహసీల్దార్లు మహేశ్, సుజాత, పశు వైద్యాధికారి ప్రశాంత్‌రెడ్డి, వేములవా డ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, ఏవో బన్నాజీ, అగ్రహారం డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీని వాస్, ఆర్టీసీ డిపో మేనేజర్ మురళీకృష్ణ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రాజగోపాల్ జెండాను అవిష్క రించారు.వేడుకల్లో ఎంపీపీ వజ్రమ్మ, బండ మల్లేశం, జడ్పీటీసీ రవి, వైస్ ఎంపీపీ కవిత పాల్గొన్నారు.
కోనరావుపేటలో తహసీల్దార్ విజయ్ ప్రకాశ్‌రావు, ఎంపీడీవో రామకృష్ణ, ఎస్ఐ దువ్వాల ఆంజనేయులు, వైద్యాధికారి వేణుమాధవ్, సెస్ ఏఈ దివ్య జెండాను ఆవిష్కరించారు.
రుద్రంగిలో ఎంపీపీ గంగం స్వరూపరాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీడీవో శంకర్, సెస్ డై రెక్టర్ ఆకుల గంగారాం, ఏఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీ నివాస్, సర్పంచ్ తర్రె ప్రభలత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ వైస్ ఎంపీపీ భూమయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంటె రెడ్డి ఉన్నారు.
చందుర్తిలో ఎంపీడీవో రవీందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏవో దుర్గరాజు, ఎంపీపీ బైరగోని లావణ్య, జడ్పీటీసీ నాగం కుమార్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మ ండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, ప్యాక్స్ చైర్మన్ తి ప్పని శ్రీనివాస్, పీహెచ్సీ వైద్యాధికారి సంపత్, పశువైద్యాధికారి నితిన్ కుమార్ తమ కా ర్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
సిరిసిల్ల టౌన్, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు బండ్లో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సాంస్కృతిక సంబురాలు అలరించాయి. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్యఅతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, పాటలు వీక్షకులను అలరించాయి. దేశ భక్తి గీతాలు, జానపద గేయాలు పర్యావరణంపై అవగాహన కల్పించే, తెలంగాణ బోనాలు, దైవ భక్తి పాటలతో హోరెత్తించారు.
కొత్త చెరువు బండ్‌పై ఏర్పాటుచేసిన ‘మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్’ ఆకట్టుకున్నది. సకినాలు, గారెలు, పోలెలు, రాగి లడ్డూలు, జావ, బబ్బెర గుడాలు, అరిసెలతో పాటు మిల్లెట్ వంటకాలను ప్రజలు ఆసక్తిగా రుచి చూశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐసీడీఎస్ ఉద్యోగులతో పాటు విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, అదనపు కలెక్టర్ పూజారిగౌతమి, ట్రైనీ ఎస్పీ రాహుల్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఆర్డీవో ఆనంద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ అయాజ్, తదితరులు పాల్గొన్నారు.