ధర్మపురి, డిసెంబర్ 29: ఆడపిల్లల పెళ్లిళ్లు పేద కుటుంబాలకు భారంగా మారుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు భరోసా కల్పిస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం బుగ్గారం మండల కేంద్రంలో మండలానికి చెందిన 23 మందికి రూ. 23,02,668 విలువ గల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలబడి, వారి పెళ్లి ఘనంగా జరగాలని ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ పథకం18 ఏళ్లు నిండిన వారికే వర్తింపజేయడం వల్ల సామాజిక రుగ్మతగా మారిన బాల్య వివాహాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయన్నారు. అలాగే షాదీ ముబారక్ కోసం మైనారిటీ సంక్షేమ నిధుల్లో ప్రత్యేకంగా కేటాయింపులు జరిగాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా సామాజిక రుగ్మతలతో కొట్టుమిట్టాడిన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వినూత్న మార్పులు సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. అంతకుముందు ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ రవి, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఆర్డీవో మాధురి, ఎంపీపీలు బాదినేని రాజమణి, ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, తహసీల్దార్ వెంకటేశ్, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, దేవాదాయశాఖ ఈఈ రాజేశ్, డీఈఈ రఘునందన్, ఈవో సంకటాల శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, మాజీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్‌కుమార్, వైస్ ఎంపీపీ సుచేందర్, కౌన్సిలర్లు అయ్యోరి వేణు, తిర్మందాసు అశోక్, ఎస్కే యూనస్, తరాల్ల కార్తీక్, కో ఆప్షన్ సభ్యులు అప్పాల వసంత్, సయ్యద్ అలీమొద్దీన్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఆకుల రాజేశ్, నాయకులు ఇనగంటి వెంకటేశ్వర్రావు, వొడ్నాల మల్లేశం, చిలివేరి శ్యాంసుందర్, కొంపల తిరుపతి, అనంతుల లక్ష్మణ్, షబ్బీర్, బాలరాజు ఉన్నారు.