కార్పొరేషన్, డిసెంబర్ 29: ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని నగర మేయర్ వై.సునీల్‌రావు పేర్కొన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో అంతర్జాతీయ వాకర్స్ దినోత్సవం సందర్భంగా బుధవారం వాకర్స్ అసోసియేషన్ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. మేయర్ హాజరై మాట్లాడుతూ.. వాకర్స్ అసోసియేషన్ల సభ్యుల తీర్మానాలను నగరపాలక సంస్థ ద్వారా తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలను ఆరోగ్యవంతులుగా మార్చేందుకు వాకింగ్ వైపు ప్రోత్సహిస్తామని తెలిపారు. నగరంలోని పలు గ్రౌండ్లలో వాకింగ్ చేస్తున్న వారికి అన్ని రకాల వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాకర్స్ కోసం నగరపాలక సంస్థ ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం చేపట్టిందన్నారు. పెండింగ్‌లో ఉన్న వాకింగ్ ట్రాక్‌లను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వాకర్స్ అసోసియేషన్ సభ్యులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌ను ఆరోగ్యవంతమైన నగరంగా మార్చేందుకు వాకర్స్ కృషి చేయాలని సూచించారు. సమావేశంలో వివిధ వాకర్స్ అసోసియేషన్స్‌కు చెందిన సభ్యులు కుమారస్వామి, గోపాల్‌రెడ్డి, దేశిని లక్ష్మీనారాయణ, అన్నమనేని సుధాకర్‌రావు, సెక్రటరీ రవీందర్, జగదీశ్వర్‌గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.