నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
తిగల్లో 120 మంది ముదిరాజ్‌లు బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరిక
వీణవంక, ఆగస్టు 28: సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు గడపగడపకూ చేరుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. జిల్లా వీణవంక మండలం బేతిగల్‌లో ఉప సర్పంచ్ తిరుపతితోపాటు గ్రామానికి చెందిన 120 మంది ముదిరాజ్‌లు శనివారం బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లో చేరికలు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు సునాయాసమేనని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని ఈటల విస్మరించినందునే ప్రస్తుతం రూ.కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర అర్థరహితమన్నారు. కాగా, బేతిగల్‌లో కమ్యూనిటీ భవనం, పెద్దమ్మగుడి ప్రహరీ నిర్మాణానికి రూ.5 లక్షలు, సీసీ రోడ్డుకు నిర్మాణానికి రూ.5 లక్షలు కావాలని ముదిరాజ్‌లు ఎమ్మెల్యేను అడిగారు. ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని, సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ భారీ మెజార్టీతో గెలవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, సర్పంచ్ మోరె సారయ్య, మాజీ ఎంపీటీసీ గొట్టుముక్కుల రవీందర్రావు, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బేతిగల్ ఉపసర్పంచ్ చొప్పరి తిరుపతి, ముదిరాజ్ సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు చొప్పరి రాజయ్య, నాయకులు బొబ్బల సమ్మిరెడ్డి, మ్యాడగోని తిరుపతిగౌడ్, కోటీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.