e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home కరీంనగర్ రిజిస్ట్రేషన్‌ చేసుకుందాం..టీకా వేసుకుందాం..

రిజిస్ట్రేషన్‌ చేసుకుందాం..టీకా వేసుకుందాం..

రిజిస్ట్రేషన్‌ చేసుకుందాం..టీకా వేసుకుందాం..

మే ఒకటి నుంచి 18ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌
నిన్నటి సాయంత్రం నుంచే మొదలైన రిజిస్ట్రేషన్‌
కొవిన్‌, ఆరోగ్యసేతులో నమోదు ప్రక్రియ
మనం అనుకున్న రోజు, అనుకున్న సెంటర్‌లోనే వేసుకునే అవకాశం
మీకు 18 ఏండ్లు నిండాయా..?
టీకా తీసుకోవాలనుకుంటున్నారా..?
మీరు కోరుకున్న చోటే వేసుకోవాలనుకుంటున్నారా..?
అయితే కేంద్రాల వద్ద రద్దీ ఉంటుందని ఆలోచిస్తున్నారా..?

కరీంనగర్‌ విద్యానగర్‌, ఏప్రిల్‌ 28 :ఏ మాత్రం ఆ ఆలోచన వద్దు! మీ కోసమే సర్కారు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది! మే ఒకటో తేదీ నుంచి మీరు అనుకున్న రోజు.. మీరు ఎంపిక చేసుకున్న సెంటర్‌లోనే వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు! ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒకటే! కొవిన్‌ పోర్టల్‌ లేదా ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే సరిపోతుంది. బుధవారం సాయంత్రం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఇంకెందుకాలస్యం!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సర్కారు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుతం 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఈ నెల 1 నుంచి వ్యాక్సిన్‌ వేస్తున్నది. వీరందరికీ వ్యాక్సినేషన్‌ సెంటర్లలో నేరుగా రిజిస్ట్రేషన్‌ చేస్తూ, టీకా ఇస్తున్నది. అయితే రేపటి (మే ఒకటి) నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మూడో దశలో అర్హులు కోట్లాదిగా ఉండడంతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించింది. బుధవారం సాయంత్రం 4గంటల నుంచే ఈ చాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొవిన్‌ పోర్టల్‌ (https://www. CoWin. gov.in/ home) లేదా ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచిస్తున్నది. నమోదు చేసుకున్న వెంటనే వ్యాక్సినేషన్‌ తేదీ, స్థలం, ఇతర వివరాలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌ మొబైల్‌ ఫోన్‌కు వస్తుంది.
కావాల్సినవి..
రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే ఏదో ఒక గుర్తింపు కార్డుతో నమోదు చేసుకోవాలి. మొబైల్‌ నంబర్‌, ఫొటో ఐడెంటిటీ కార్డు (ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ, పాన్‌ కార్డు, ఉపాధిహామీ కార్డు, బ్యాంకు లేదా పోస్టాఫీస్‌ పాసుబుక్‌, పాసుపోర్టు, పెన్షన్‌ డాక్యుమెంట్‌, ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ జారీ చేసిన అధికారిక ఐడీ కార్డు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కార్డు.. ఇలా ఏదో ఒక కార్డుతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
ఆరోగ్య సేతులో ఇలా..
ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ ఓపెన్‌ చేసి హోం పేజీలోని కొవిన్‌ ట్యాబ్‌ క్లిక్‌ చేయాలి. నాలుగు ఆప్షన్లు వస్తాయి. అందులో వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. తర్వాత రిజిస్ట్రార్‌ నౌ క్లిక్‌ చేయాలి. ఫోన్‌ నంబరు ఎంటర్‌ చేసిన తర్వాత వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేయాలి. వెరిఫై క్లిక్‌ చేయగానే రిజిస్ట్రేషన్‌ పేజీకి వెళ్తుంది. అప్పుడు కొవిన్‌ యాప్‌ మాదిరి వివరాలు నమోదు చేసుకోవాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రిజిస్ట్రేషన్‌ చేసుకుందాం..టీకా వేసుకుందాం..

ట్రెండింగ్‌

Advertisement