టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి
హుజూరాబాద్, సిద్దిపేట మున్సిపల్ అధ్యక్షులు రాధిక, రాజనర్సు
హుజూరాబాద్‌టౌన్, ఆగస్టు 27: స్వరాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టంగట్టాలని, టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కే రాజనర్సు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని 28వ వార్డులో గందె రాధిక ఆధ్వర్యంలో ఇంటింటా బొట్టుపెట్టి కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే 19వ వార్డులోని కిందివాడ, తెనుగువాడ, పోచమ్మవాడ, పక్కీర్వాడలో స్థానిక కౌన్సిలర్ గొసుల రాజు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలువాలని, అమూల్యమైన ఓటు వేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. ఇక్కడ మాజీ చైర్మన్, కౌన్సిలర్ మంద ఉమాదేవి, కౌన్సిలర్లు అపరాజ ముత్యంరాజు, గోస్కుల రాజు, సీనియర్ నాయకులు గందె శ్రీనివాస్, ఆర్ కే రమేశ్, రాజేశ్‌రెడ్డి, వెంకటేశ్, మణిదీప్, సిద్దిపేట ఇన్చార్జి మల్లికార్జున్, గందె సాయిచరణ్, కొండపాక శ్రీనివాస్, నల్ల బాలరాజు, కే సారయ్యగౌడ్, కొలిపాక యాదగిరి, తులసి లక్ష్మణ మూర్తి, సబ్బని రమేశ్ ఉన్నారు.
పోతిరెడ్డిపల్లిలో ఇంటింటా ప్రచారం
వీణవంక, ఆగస్టు 27: రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోతిరెడ్డిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ రాధారపు రాంచందర్ , స్థానిక నాయకులు గ్రామంలో గడపగడపకూ తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, కారు గుర్తుకు ఓటు వేసి, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గజ్జెల శ్రీకాంత్, వార్డు సభ్యులు నందిపాట ఆశ-రమేశ్, రేణు-ఐలయ్య, స్వరూప-ఐలయ్య, స్వరూప-సాయిలు, నాయకులు రాజు, పైడి, మహేందర్, రమేశ్, స్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.