సుల్తానాబాద్, జనవరి 26 : తెలంగాణ ప్రభుత్వం చేతి వృత్తులకు సాయం అందిస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. సుల్తానాబాద్‌లో నాయీబ్రహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ను అందించడంతో పాటు, ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని వివరించారు. స్థలం కేటాయింపునకు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత-రమేశ్, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మాజీ ఎంపీపీ అయిల రమేశ్, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం ప్రేమ్‌చందర్‌రావు, పట్టణాధ్యక్షుడు పారుపెల్లి గుణపతి, నాయకులు ముత్యం రమేశ్, సూరశ్యాం, కూకట్ల గోపి, రేవెల్లి తిరుపతి, సాజిద్, పొన్న చంద్రయ్య, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు వడ్లూరి శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, వేయికండ్ల నరేందర్, అవుదుర్తి శ్రీనివాస్, రాజమౌళి, లక్ష్మణ్ తదితరులున్నారు.