జూలపల్లి, అక్టోబర్ 24: ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రజలను చైతతన్యవంతం చేయాలని కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు దండె వెంకటేశం సూచించారు. జూలపల్లిలో ఆదివారం కేసీఆర్ సేవాదళ్ మండల కార్యవర్గం ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంస్థ సభ్యులు విశ్వాసంగా సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలువాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వానికి అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలాధ్యక్షుడిగా గడ్డం రాజేశ్వర్రెడ్డి(కుమ్మరికుంట) ఉపాధ్యక్షులుగా రేచవేని సతీశ్(వడ్కాపూర్), మానుమాండ్ల సంపత్(జూలపల్లి), ప్రధాన కార్యదర్శిగా అమరగాని శ్రీనివాస్(జూలపల్లి), కోశాధికారిగా జూపాక సతీశ్(వడ్కాపూర్) సంయుక్త కార్యదర్శిలుగా కోరుకంటి సంతోష్(బాలరాజుపల్లి), షాబొద్దీన్తోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చొప్పరి మహేశ్, నాయకులు తోట శ్రావణ్, రేచవేని రవి, ఆవుల పోచాలు, పడాల తిరుపతి, బూతం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.