హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 24: అనేక కుట్రలు పన్నుతూ ప్రతి దానికీ అడ్డుతగులుతున్న బీజేపీని ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ మీటింగ్ పెడితే ఎక్కడ ఓడిపోతామోననే భయంతో సభ జరుగకుండా బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు కుట్రలు చేశారని దుయ్యబట్టారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లిలో మంత్రి గంగుల పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ కులస్తులు మంత్రి ని కలిశారు. టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ధరలు పెంచి ప్రజలను నట్టేట ముంచుతున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలో ఆ పార్టీ నేతలు చె ప్పాలని ప్రశ్నించారు. ఇన్నేండ్లలో యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థల ఆస్తులు అమ్ముతూ.. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమగ్ర విధానాల వల్ల దేశం తీవ్రంగా నష్టపోతున్నదని, తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నుల్లోంచి జీఎస్టీ రూపంలో అత్యధిక శాతం తీసుకుంటూ దానిలో సగం కూ డా రాష్ట్రానికి ఇవ్వకుండా వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. ప్రచారంలో బీజేపీ అభ్యర్థి కానీ కేంద్ర మంత్రులు కానీ హుజూరాబాద్‌కు ఏం చేస్తామో చెప్పకుండా అన్నీ ఉత్తముచ్చట్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చే స్తున్న ప్రగతి, పథకాల్లో వా టా ఉందని పదేపదే చెప్పే బీజేపీ నాయకులు దళితబంధులో ఎందుకు వాటా ఇవ్వడంలేదో ప్రశ్నించాలన్నారు. దమ్ముం టే దళితులకు మరో రూ.పది లక్షలు కేంద్రం నుం చి ఇప్పించాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పట్ట ణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, యూత్ నాయకుడు పీ అనిల్‌యాదవ్, ముదిరాజ్ సంఘం నాయకులు గంట శ్రీనివాస్, గంట సమ్మయ్య, గంట కొంరయ్య, గంట రమేశ్, మ ధూకర్, ప్రశాంత్, కనకయ్య, సమ్మ య్య, దండబోయిన తిరుపతి, రవీందర్, గంట శంకరయ్య ఉన్నారు.