e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home కరీంనగర్ సైబర్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండండి

సైబర్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండండి

వెల్గటూర్‌, నవంబర్‌ 23: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైబర్‌ నేరాలు, సెల్‌ఫోన్‌ అతిగా వాడకం, వాటి వల్ల కలిగే నష్టాలపై ధర్మపురి సీఐ బిల్లా కోటేశ్వర్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడు తూ, సెల్‌ ఫోన్‌ టెక్నాలజీ పెరగడంతో నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. సైబర్‌ నేరాలపై టోల్‌ ఫ్రీ నంబర్‌ 155260కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి బత్తుల భూమయ్య, ఎస్‌ఐ నరేశ్‌, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు మద్ది మురళి, చల్లూరి రాంచందర్‌ గౌడ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కోరుట్ల, నవంబర్‌ 23: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. షీ టీమ్స్‌, యంగిస్థాన్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో 1,600 పాఠశాలలను ఎంపిక చేసి వలంటీర్ల ద్వారా విద్యార్థులకు సైబర్‌ నేరాలు, మోసపోవడం తీరు తెన్నులపై అవగాహన కల్పిస్తున్నట్లు సైబర్‌ టీచర్‌ నాగరాజు తెలిపారు. అనంతరం ఇప్పటికే శిక్షణపొందిన విద్యార్థినులు గంగోత్రి, నిలీమ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం గడెల భూపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కథలాపూర్‌, నవంబర్‌ 23: అంబారిపేట, కథలాపూర్‌ జడ్పీ హైస్కూళ్లలో సైబర్‌ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సఖీ జిల్లా కో ఆర్డినేటర్‌ మనీల, ఎస్‌ఐ రజిత మాట్లాడుతూ, సోషల్‌ మీడియాలో విద్యార్థులు అపరిచిత వ్యక్తులకు దూరం గా ఉండాలని, చాటింగ్‌ చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు హెచ్‌ఎం మార్గం రాజేంద్రప్రసాద్‌, రవికుమార్‌, రాజగోపాల్‌, ధరందీప్‌ పాల్గొన్నారు.
రాయికల్‌ రూరల్‌, నవంబర్‌ 23: భూపతిపూర్‌ ఉన్నత పాఠశాలలో సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ కిరణ్‌ పాల్గొని మాట్లాడారు. పాఠశాల స్థాయినుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం లక్ష్మణ్‌, ఉపాధ్యాయులు రామస్వామి, మహేశ్‌ నాయక్‌, కార్తీక్‌, గిరిధర్‌, శంకరయ్య, తిరుమల, జ్యోతి పాల్గొన్నారు.
పెగడపల్లి, నవంబర్‌ 23: మండలకేంద్రంలోని ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు సైబర్‌ నేరాలపై ఎస్‌ఐ కొక్కుల శ్వేత అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఐ సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ సుంకరి రవి, ఉపాధ్యాయులు మంజూర్‌ అహ్మద్‌, ఆడెపు మనోజ్‌కుమార్‌, ఇస్రాద్‌ అలీ, వనిత, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్‌, నవంబర్‌23: రేచపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో సైబర్‌ నేరాలు, సామాజిక మధ్యమాలపై ఎస్‌ఐ బండి లావణ్య అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్‌ఐ మాట్లాడుతూ, సైబర్‌ నేరాలు, సామాజిక మధ్యమాల వినియోగం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎడమల జయ, ఉప సర్పంచ్‌ రాచకొండ రాజేశం, ప్రధానోపాధ్యాయుడు శ్రీదీప్‌, ఏఎంసీ చైర్మన్‌ రమేశ్‌, నాయకులు ఎడమల లక్ష్మారెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మెట్‌పల్లి రూరల్‌, నవంబర్‌ 22: వెల్లుల్ల జడ్పీహెచ్‌ఎస్‌లో తెలంగాణ పోలీస్‌ శాఖ, షీటీమ్‌, యం గిస్థాన్‌ ఆర్గనైజేషన్‌, సమగ్ర శిక్షా విద్యాశాఖ ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలు, మోసాలపై అవగాహన కల్పించారు. మెట్‌పల్లి ఏఎస్‌ఐ సత్యనారాయణ, హెచ్‌ఎం జగదీశ్వర్‌, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement