e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 24, 2022
Home కరీంనగర్ ప్రచార హోరు..చేరికల జోరు

ప్రచార హోరు..చేరికల జోరు

గులాబీ గూటికి వలసల వెల్లువ
అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులవుతున్న సకలజనం
పార్టీలో పెద్దసంఖ్యలో చేరిక
టీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న మద్దతు
అండగా నిలుస్తున్న సబ్బండవర్గాలు

జమ్మికుంట/ ఇల్లందకుంట/ వీణవంక/ కమలాపూర్‌/జమ్మికుంట రూరల్‌ అక్టోబర్‌ 22: ఉప ఎన్నిక వేళ గులాబీ దూకుడు కొనసాగుతున్నది. ఏడేండ్ల ప్రగతిని చూసి వివిధ పార్టీల నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు ఆకర్షితులవుతుండగా, పెద్దసంఖ్యలో తాకిడి కనిపిస్తున్నది. సబ్బండవర్గాలు మద్దతు పలుకడం, రోజురోజుకూ వలసల సంఖ్య పెరుగుతుండగా అదే జోష్‌తో జిల్లా నాయకత్వం ప్రచారంలో దూసుకెళ్తున్నది. శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా పలు సంఘాలు మద్దతు పలుకగా, జమ్మికుంట మండలం పెద్దంపల్లికి చెందిన కిసాన్‌మోర్చా జిల్లా నాయకుడు గూడూరి శ్రీనివాస్‌రెడ్డి, వీణవంక మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మాజీ ఉపసర్పంచ్‌ రామయ్య, కమలాపూర్‌ మండలంలోని పలు గ్రామాలు, ఇల్లందకుంట మండలానికి చెందిన బీజేపీ కార్యకర్తలు, ఆటోయూనియన్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయాచోట్ల మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎంపీ బండ ప్రకాశ్‌, ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యేలు సండ్ర, చల్లా కండువాలు కప్పి ఆహ్వానించారు.
చేరికల వెల్లువ
ఇల్లందకుంట మండలం సిరిసేడు, కనగర్తి గ్రామాలకు చెందిన 40మంది బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరగా, వినోద్‌కుమార్‌ కండువా కప్పి ఆహ్వానించారు. చేరిన వారిలో రేణుకుంట్ల జానీ, రేణుకుంట్ల రమేశ్‌, సతీశ్‌, నాగరాజు, శివ, సంపత్‌, సంతోష్‌, సునీల్‌, సంపత్‌, రమేశ్‌, రాజు, సమ్మయ్య, క్రాంతి, లింగమూర్తి, సాయిలు, నరేశ్‌, విష్ణు, సంపత్‌, సదా, అజయ్‌, ప్రవీణ్‌, భద్రయ్యతో పాటు తదితరులు ఉన్నారు. ఇక్కడ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, సర్పంచ్‌లు రఫీఖాన్‌, మట్ట రజిత, ఎంపీటీసీలు చిన్నరాయుడు, దరుగుల రమా, గజ్వేల్‌ ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ బుర్ర రమేశ్‌, మాజీ ఎంపీటీసీ కుమార్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ తాతా మధు, టీఆర్‌ఎస్‌ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, వాసుదేవరెడ్డి, రాకేశ్‌, రాజశేఖర్‌, అనిల్‌, తారక్‌ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన కిసాన్‌మోర్చా నాయకుడు
జమ్మికుంట మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన కిసాన్‌మోర్చా జిల్లా నాయకుడు గూడూరి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కోరపల్లి గ్రామానికి చెందిన ఆటో ట్రాలీ యూనియన్‌ నాయకులు, సభ్యులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

  • ఇక వీణవంక మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బీజేపీ నేత మాజీ ఉపసర్పంచ్‌ గాజుల రామయ్యను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్కడ మాజీ సింగిల్‌విండో చైర్మన్‌ మాడ సాదవరెడ్డి, నాయకులు రాయిశెట్టి శ్రీనివాస్‌, గాజుల రవి పాల్గొన్నారు.
    ఆటోయూనియన్‌ సభ్యులు..
    టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటోల పన్ను రద్దు చేసిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో బుజూనూర్‌ గ్రామానికి చెందిన 28మంది ఆటో యూనియన్‌ నాయకులు, సీతంపేట గ్రామానికి చెందిన 10మంది బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్సీ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో ఆటోయూనియన్‌ నాయకులు ఎడ్ల కుమార్‌, విజయ్‌తో పాటు 38మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, సర్పంచ్‌లు వెంకటస్వామి, సరిగొమ్ముల అరుణసదానందం, కంది దిలీప్‌రెడ్డి, ఎంపీటీసీ ఓదెలు తదితరులున్నారు.
- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement