కరీంనగర్ రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య
వాలీబాల్ కోర్టు ఏర్పాటుకు విరాళం
కరీంనగర్ రూరల్, నవంబర్ 21: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలని ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య కోరారు. మండలంలోని ఇరుకుల్ల ప్రాథమిక పాఠశాల ఆవరణలో వాలీబాల్ కోర్టు ఏర్పాటుకు గ్రామానికి చెందిన థామస్ (ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు) రూ. 25 వేలు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, గ్రామీణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. మండలంలో క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. పిల్లలు క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. అనంతరం ఎంపీపీని సర్పంచ్, గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. సర్పంచ్ బలుసుల శారద, మన్నన స్వచ్ఛంద సంస్థ సభ్యులు బలుసుల శంకరయ్య, బలుసుల శివకుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జువ్వాడి రాజేశ్వర్రావు, మండల కో-ఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషా, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బుర్ర రమేశ్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.