శుక్రవారం 05 మార్చి 2021
Karimnagar - Jan 24, 2021 , 04:01:35

మహనీయుల అడుగుజాడల్లో నడవాలి

మహనీయుల అడుగుజాడల్లో నడవాలి

యువతకు మేయర్‌ వై సునీల్‌రావు పిలుపు

జిల్లా వ్యాప్తంగా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలు

కార్పొరేషన్‌, జనవరి 23: యువత దేశం కోసం పోరాటం చేసిన మహనీయుల అడుగుజాడల్లో నడవాలని మేయర్‌ వై సునీల్‌రావు పిలుపునిచ్చారు. సుభాష్‌చంద్రబోస్‌ జయంతి సందర్భంగా స్థానిక సుభాష్‌నగర్‌లోని నేతాజీ విగ్రహానికి శనివారం మేయర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం నేతాజీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు యువత కృషి చేయాలని సూచించారు.   కార్పొరేటర్లు అర్ష కిరణ్మయి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

రాంనగర్‌, జనవరి 23 : కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. కమిషనరేట్‌ కేంద్రంలో  నేతాజీ చిత్రపటానికి సీపీ కమలాసన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు శ్రీనివాస్‌, చంద్రమోహన్‌, సీపీవో అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి ఉమేష్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్లు, వివిధ స్థాయిల పోలీసులు పాల్గొన్నారు. 

కమాన్‌చౌరస్తా, జనవరి 23 : నగరంలోని ప్రజ్ఞాభారతి కార్యాలయంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి ప్రజ్ఞాభారతి జిల్లా అధ్యక్షుడు, సీఏ నిరంజనాచారి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మందల నగేష్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గాజుల రవీందర్‌, దేశిని శ్రీనివాస్‌, ఆర్థిక కార్యదర్శి జే సత్యనారాయణ రెడ్డి, సముద్రాల నాగేశ్వర్‌రావు, సంయుక్త కార్యదర్శి ఎస్‌ సత్యనారాయణ, సీహెచ్‌ రవీందర్‌ రెడ్డి, మహిళా కార్యదర్శి మందల అనిత, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా సహ కార్యవాహ ఎలగందుల సత్యనారాయణ పాల్గొన్నారు.  

కొత్తపల్లి, జనవరి 23: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేతాజీ అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో సుడా డైరెక్టర్‌, చింతకుంట ఎంపీటీసీ భూక్యా తిరుపతి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఏవీఎస్‌ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

హౌసింగ్‌బోర్డుకాలనీ, జనవరి 23: భగత్‌నగర్‌ చౌరస్తాలో నేతాజీ చిత్రపటానికి  తెలంగాణ జాగృతి యువత జిల్లా అధ్యక్షుడు ఉయ్యాల విష్ణువర్ధన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ జాగృతి యువత పట్టణ కో-కన్వీనర్‌ రాముచారి, విశ్రాంత ఉద్యోగులు సత్యనారాయణ, రాచకొండ జనార్దన్‌రావు, జాగృతి యువత నాయకులు పాలకుర్తి మహేశ్‌, సృజన్‌, కిరణ్‌, విక్రమ్‌, సురేశ్‌  పాల్గొన్నారు. 

విద్యానగర్‌, జనవరి 23: నగరంలోని 56వ డివిజన్‌ (భాగ్యనగర్‌)లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలను శనివారం వెస్ట్‌జోన్‌ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్‌ అధ్యక్షుడు నరహరి లక్ష్మారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు ఎన్నం ప్రకాశ్‌, బీజేపీ నాయకులు నరోత్తంరెడ్డి, పాశం నర్సింహారెడ్డి, సంపతికుమారి, శశికళ, రాంమోహన్‌రావు, రాజిరెడ్డి, కిషన్‌రెడ్డి, మహిపాల్‌ పాల్గొన్నారు.

తెలంగాణచౌక్‌, జనవరి 23: నగరంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్‌ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. సుభాష్‌నగర్‌లోని నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీధర్‌ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నేతాజీ ఆశయాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు ఎండీ అజామ్‌, జహంగీర్‌పాషా, మిల్కూరి సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo