న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రసంగానికి చెందిన ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో అరుణ్ రెడ్డిని శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనిపై ఐపీసీలోని 120బీ(నేరపూరిత కుట్ర) కింద కేసు బుక్ చేశారు. అరుణ్ రెడ్డిని మూడు రోజుల పాటు కస్టడీలో ఉంచనున్నారు. గత రాత్రి అతన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. ఇవాళ పాటియాలా కోర్టు ముందు అతన్ని ప్రవేశపెట్టనున్నారు. స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్‌ను అరున్ రెడ్డి హ్యాండిల్ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు నిర్దారించారు.