సోమవారం 18 జనవరి 2021
Karimnagar - Nov 30, 2020 , 00:59:56

వైభవంగా సత్యనారాయణ వ్రతాలు

వైభవంగా సత్యనారాయణ వ్రతాలు

  • తరలివచ్చిన దంపతులు
  • కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ వేడుకలు

కరీంనగర్‌కల్చరల్‌: నగరంలోని  భగత్‌నగర్‌ అంజనాద్రి ఆలయంలో ఆదివారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు  వైభవంగా నిర్వహించారు.  ప్రముఖ పురోహితులు గర్రెపల్లి మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్రతాల్లో  60 మంది దంపతులు పాల్గొన్నారు.  కాగా, కొవిడ్‌ నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకపాటి హనుమంతరావు, మీస శ్రీనివాస్‌, పత్తెం మారుతిరెడ్డి, హనుమాండ్ల శ్రీనివాస్‌, ఆలయ అర్చకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.