రామడుగు, నవంబర్ 15: మండలంలోని దేశరాజ్‌పల్లి గ్రామంలో సోమవారం శాతవాహన లయన్స్‌క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సుమారు 60మంది రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్‌క్లబ్ చైర్మన్, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం మానవాళిని పీడిస్తున్న వ్యాధుల్లో మధుమేహం మొదటిస్థానంలో నిలుస్తున్నదని పేర్కొన్నారు. భారతదేశంలో రోజురోజుకూ ఈ వ్యాధి యువతను భయభ్రాంతులకు గురిచేస్తుందని తెలిపారు. ముందస్తుగా వ్యాధిని గుర్తించి అదుపులో ఉంచుకోవాలని సూచించారు. దీనిలో భాగంగానే లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ కార్యదర్శి డాక్టర్ మనోహరాచారి, ట్రెజరర్ అరవింద్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ బి.మధుసూదన్‌రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ రమేశ్, ఉపాధ్యక్షుడు ముత్తోజు వేణు, మెంబర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వి.జగదీశ్వరాచారి, ఎంపీటీసీ వంచ మహేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ మాడ్గుల రత్నాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.