sarangapur | సారంగాపూర్, జూన్ 20 : సారంగాపూర్ మండలంలోని పోతారం గ్రామ పంచాయతీ పరిధిలోని గణేష్పల్లి లో శుక్రవారం అర్ధ రాత్రి పిచ్చికుక్క దాడిలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.. రాత్రి గాయపడిన వారిని జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.
స్థానికుల కథనం ప్రకారం.. గణేష్పల్లిలో గ్రామంలో ఎండాకాలం కావడంలో గ్రామస్తులు ఆరుబయట మంచాలు వేసుకుని నిద్రిసున్నారు. అర్ధరాత్రి 12:30 సమయంలో పిచ్చి కుక్క ఒక్కసారిగా నిద్రిస్తున్న వారిపై పడి దాడిచేసింది. ఈ దాడిలో ఐదుగురు మహిళలు, ఆరు సంవత్సరాల బాబు, ఎనిమిది మంది పురుషులు గాయపడ్డారు. కాగా వీరిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారికి చికిత్స పొంతుతున్నారు.