జడ్పీ, దవాఖాన అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ
జిల్లా దవాఖాన సందర్శన
అభివృద్ధి పనులపై సమీక్ష
సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 13: ప్రైవేట్‌కు దీటుగా జిల్లా దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని జడ్పీ, జిల్లా దవాఖాన అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. సోమవారం ఆమె జిల్లా దవాఖానను క్షేత్రస్థాయిలో సందర్శించి, పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పీడీయాట్రిక్ వార్డు పనులను పరిశీలించారు. తర్వాత టీఎస్ ఎంఐడీసీ ఈఈ రవీందర్‌తో ఫోన్లో మాట్లాడి పీడీయాట్రిక్ వార్డు పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దవాఖాన ఆవరణలో శానిటేషన్ నిర్వహణలో లోపాలు లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించాలని కోరారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో దవాఖానలో ఆధునిక వైద్య సేవలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆయా విభాగాలకు సంబంధించిన వైద్య నిపుణులతోపాటు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రసూతి సేవల్లో జిల్లా దవాఖాన ప్రథమ సేవలను అందిస్తున్నదన్నారు. సమావేశంలో సూపరింటెండెంట్ మురళీధర్‌రావు, ఆర్ఎంవో రఘు, గైనకాలజిస్ట్ స్వాతి, తదితరులు పాల్గొన్నారు.అలాగే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా గ్రంథాలయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల మల్లికార్జున్‌గౌడ్, న్యాలకొండ రాఘవరెడ్డి, దూస ఏకనాథ్, రామనాథం, బుర్ర శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.