జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్
బీజేపీ దిష్టిబొమ్మల దహనం
మానకొండూర్, నవంబర్ 13 : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై చేసిన అనుచిత వాఖ్యలపై బీజేపీ నాయకులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మానకొండూర్ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో టీఅర్ఎస్ పార్టీ శ్రేణులు పల్లెమీద చౌరస్తావద్ద ఆందోళన చేసి బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ, రైతుల కోసం టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాతో బీజేపీ నాయకుల కళ్లు బైర్లు కమ్మాయని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో బీజేపీ ఉనికి కాపాడుకోవడానికి ఆ పార్టీ నాయకులు ధర్నాలు, నిరసనలు చేపడుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు వారి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై ఇకపై ఏకవచనంతో వ్యాఖ్యలు చేస్తే గ్రామాల్లో బీజేపీ నాయకులను తరిమికొడతామని హెచ్చరించారు. సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, టీఆర్ఎస్వీ నియోజక కన్వీనర్ గుర్రం కిరణ్ గౌడ్, టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు ఆడప శ్రీనివాస్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్‌రెడ్డి, నాయకులు పడాల సతీశ్‌గౌడ్, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, వీరేశం, సత్యనారాయణరెడ్డి, ఉండింటి శ్యాంసన్, పిట్టల మధు, శాతరాజు యాదగిరి, పురం అనిల్, కిరణ్,దండు రాములు,అంజయ్య పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతాం
శంకరపట్నం, నవంబర్ 13: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడతామని జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ నాయకులు బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే రసమయి మాటలను ఎడిటింగ్ ద్వారా వక్రీకరించి బూతులు తిట్టినట్లు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, ఏఎంసీ వైస్‌చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, ప్యాక్స్ చైర్మన్లు పొద్దుటూరి సంజీవరెడ్డి, కేతిరి మధూకర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ అంతం క్రిష్ణారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాజాపాషా, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు ఉమ్మెంతల సతీశ్ రెడ్డి, మేకల కుమార్, బొజ్జ రవి, అలీమొద్దీన్, బొజ్జ సుధాకర్ పాల్గొన్నారు.