కమాన్‌చౌరస్తా, నవంబర్ 13: జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో శనివారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల, హనుమాన్ నగర్‌లోని బ్లూబెల్స్ హైసూల్, భగత్‌నగర్‌లోని వివేకానంద విద్యానికేతన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అల్ఫోర్స్‌లో నిర్వహించిన వేడుకల్లో భాగంగా నెహ్రూ చిత్రపటానికి విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్ రెడ్డి, ఎస్ఆర్ఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ వీ మధుసూదన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్లూబెల్స్ పాఠశాలలో ప్రిన్సిపాల్ జంగ సునీతామనోహర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం చిన్నారుల నృత్యాలు, నాటికలు, పాటలు, వేషధారణ ఆకట్టుకుంది. అలాగే, వివేకానంద విద్యానికేతన్ హైసూల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తపల్లి, నవంబర్ 13: కరీంనగర్-జగిత్యాల రోడ్డులోని ‘ది ప్లే’ స్కూల్లో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల చైర్మన్ డాక్టర్ సుధాకర్‌రావు మాట్లాడుతూ, చిన్నారులకు ఆటాపాటలతో విద్యా బోధన చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి రమాదేవి, ప్రధానోపాధ్యాయురాలు ప్రభాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, నవంబర్ 13: నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలని ఎస్పీఆర్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ చొక్కారెడ్డి పేర్కొన్నారు. నగునూర్‌లోని ఎస్పీఆర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఆర్ యాకయ్య, పాఠశాల చైర్మన్ డాక్టర్ విజయమోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ పీ ఆర్ రాజేందర్, డైరెక్టర్లు డాక్టర్ శ్యాంసుందర్, డాక్టర్ ప్రశాంత్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.