చిగురుమామిడి, జనవరి 12: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి జువేరియా సూచించారు. చిగురుమామిడి ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించి, స్టాక్ వివరాలను మండల వైద్యాధికారి నాగశేఖర్ను అడిగి తెలుసుకున్నారు. పీపీఈ కిట్లు, కొవిడ్ అత్యవసర పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఒమిక్రాన్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ప్రతి ఒకరూ రెండో డోసు వేసుకునేలా చూడాలన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల వారందరూ టీకాలు వేసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం ములనూరు, చిగురుమామిడి, సుందరగిరి ఆరోగ్య ఉప కేంద్రాల్లో టీకా కేంద్రాలను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలను ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ మండల వైద్యాధికారి నాగశేఖర్, ఫార్మాసిస్ట్ రామేశం, హాజీబాబా, స్టాఫ్ నర్సులు భారతి, గాయత్రి, సూపర్పైజర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోస్
మానకొండూర్ రూరల్, జనవరి 12: లక్ష్మీపూర్ (వెల్ది) పీహెచ్సీ పరిధిలో డాక్టర్ బియాబానీ ఆధ్వర్యంలో బుధవారం 71 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. లక్ష్మీపూర్, వెల్ది, ఊటూర్, పచ్చునూర్, వేగురుపల్లి, కెల్లేడు, దేవంపల్లి, లింగాపూర్ తదితర గ్రామాల్లో వ్యాక్సిన్ వేశారు. 18 ఏళ్లు పైబడిన వారు 107 మంది, 15-18 ఏండ్ల వారు 34 మంది, ఫ్రంట్‌లైన్ వారియర్స్, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది 38 మందికి కలిపి మొత్తం 179 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు అన్నపూర్ణ, ఎండీ జుబేర్, ఎల్డీ కంప్యూటర్ ఆపరేటర్ ఎండీ ఇజాజ్ తదితరులు ఉన్నారు.