మానకొండూర్, డిసెంబర్ 10: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి దేశానికి తీరనిలోటని ఎన్జీపీఎస్వో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు బొద్దుల శ్రావణ్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్జీపీఎస్వో ఆధ్వర్యంలో రావత్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఏఎం సీ మాజీ చైర్మన్ మల్లగల్ల నగేశ్, నాయకులు ఇస్కుల్ల అంజయ్య, దేశరాజు రాజు, బండి మహేశ్‌గౌడ్, సభ్యులు పాల్గొన్నారు.
కొవ్వొత్తులతో ర్యాలీ
శంకరపట్నం, డిసెంబర్ 10: భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ మృతికి భీమ్ ఆర్మీ నాయకులు నివాళులర్పించారు. ఈ నెల 8న రావత్ హెలికాప్టర్ దుర్ఘటనలో దుర్మరణం చెందారు. మండల కేంద్రంలో గురువారం రాత్రి భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. హెలికాప్టర్ దుర్ఘటనలో అమరులైన 12 మంది సైనిక అధికారులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసాల శ్రీనివాస్, నాయకులు ఎదురుగట్ల సంపత్, దేవునూరి భాస్కర్, దామెర సతీశ్, ఓదెల శ్రీనివాస్, స్థానిక పోలీస్ కానిస్టేబుళ్లు, భాస్కర్‌రెడ్డి, రాజయ్య పాల్గొన్నారు.
మన్నెంపల్లిలో అమరులకు నివాళి
తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్10: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ సేనకు మన్నెంపల్లి గ్రామంలో శుక్రవారం నివాళులర్పించి, కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. ఇక్కడ ఉపసర్పంచ్ పొన్నం అనిల్‌గౌడ్, సర్పంచ్ మేడి అంజయ్య, నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.