పెద్దపల్లి రూరల్, నవంబర్ 10: రైతులకు మద్దతు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి, మారేడుగొండ, రాంపల్లి, చీకురాయి, మూలసాల, కొత్తపల్లి, పెద్దబొంకూర్ బుధవారం పెద్దపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో గుర్రాంపల్లి, మారేడుగొండ, రాంపల్లి, చీకురాయి, మూలసాల, కొత్తపల్లి, పెద్దబొంకూర్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో చేతులెత్తేసినా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పెద్దపల్లి సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నర్సింహారెడ్డి, సీఈవో మెట్టు మదన్మోహన్, సర్పంచులు మాదిరెడ్డి భాగ్యలక్ష్మి, కన్నం జయ్, కనపర్తి శ్రీలేఖ ప్రభాకర్‌రావు, బండారి త్రివేణి, ఎలగందుల శంకరయ్య, శీలారపు సత్యంయాదవ్, కారుపాకల మానస సంపత్‌కుమార్, ఎంపీటీసీలు మాదిరెడ్డి తిరుపతి రెడ్డి, గుర్రాల లక్ష్మీగట్టేశం, మేకల రాజేశ్వరి శ్రీనివాస్, మందల సరోజిని రాంరెడ్డి, డైరెక్టర్లు మెట్టు సమ్మయ్యగౌడ్, సలేంద్ర రాముల యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 10: తొగర్రాయిలోని గుడి బండవద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ తిరుమల శంకర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, వార్డు సభ్యురాలు రాధ, సెంటర్ ఇన్చార్జి పద్మ తదితరులు పాల్గొన్నారు.
జూలపల్లి, నవంబర్ 10: జూలపల్లి సింగిల్ విండో పరిధిలోని కోనరావుపేటలో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ కూసుకుంట్ల మంగ, విండో చైర్మన్ కొంజర్ల వెంకటయ్య, ఎంపీటీసీ సభ్యుడు దండె వెంకటేశం, డైరెక్టర్లు తొగరు శ్రీనివాస్, కూసుకుంట్ల సోని, కొమ్మ ఐలయ్య, సంకెండ్ల లక్ష్మణ్, నాయకులు శాతల్ల కాంతయ్య, కూసుకుంట్ల రాంగోపాల్‌రెడ్డి, కత్లెర్ల రాయమల్లు, కూసుకుంట్ల రవీందర్‌రెడ్డి, కూసుకుంట్ల కృష్ణారెడ్డి, బోడ సంపత్‌రెడ్డి, సంకసాని మారుతిరెడ్డి, ఏఈవో రమేశ్, సీఈవో గీస సురేశ్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్‌సిటీ, నవంబర్ 10: ఎల్కలపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కన్నాల సింగిల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి, సర్పంచ్ స్వరూప రాజ్‌కుమార్ ప్రారంభించారు. ఇక్కడ సీఈవో సదయ్య, ఎంపీటీసీ సతీశ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, సభ్యులు మాధవి, లక్ష్మి, రాజ కొంరయ్య, మల్లేశ్, శ్రీనివాస్, రాజయ్య ఉన్నారు.
ఎలిగేడు, నవంబర్ 10: బురహన్మియాపేట, లాలపల్లి, సుల్తాన్‌పూర్‌లో ఎలిగేడు విండో ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఐకేపీ-పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ తానిపర్తి స్రవంతితో కలిసి విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ సర్పంచులు కొండయ్యరాజా, అర్శనపల్లి వెంకటేశ్వరరావు, సింగిరెడ్డి ఎల్లవ్వ, విండో డైరెక్టర్లు ఏలేటి వెంకటరెడ్డి, దాసరి రాజిరెడ్డి, తాటిపెల్లి రమేశ్‌బాబు, సీఈవో కేశెట్టి విక్రం, నాయకులు తానిపర్తి మోహన్‌రావు, బద్దం తిరుపతిరెడ్డి, రాజనర్సు తదితరులున్నారు.
రామగిరి, నవంబర్ 10: నవాబ్‌పేట, కల్వచర్ల, లొంకకేసారం, రత్నాపూర్, లద్నాపూర్, ముస్త్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచులు గాజుల ప్రశాంతి, గంట పద్మ, ఎండీ మంజూర్, పల్లె ప్రతిమ, బడికెల విజయ శ్రీనివాస్, రామగిరి లావణ్య నాగరాజుతో కలిసి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొంరయ్య ప్రారంభించారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశానుసారం సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి భాస్కర్, ఎంపీటీసీలు మారగోని కరుణ కుమారస్వామి, ధర్ముల రాజ సంపత్, మేడగోని ఉమ రాజయ్య, కొట్టె సందీప్, పూదరి సత్యనారాయణ, ఏపీఎం స్వరూపరాణి ఏవో మోహన్, ఐకేపీ సీసీ ఇందిర, ఏఈవో రమ్య, గాజుల ప్రసాద్, దుబ్బాక సత్యారెడ్డి, బర్ల కుమార్ తదితరులు ఉన్నారు.
ఓదెల, నవంబర్10 : సహకార సంఘం ఆధ్వర్యంలో లంబాడితండలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, సర్పంచ్ లక్ష్మీ వస్త్రంనాయక్, ఉప సర్పంచ్ నిమ్మనాయక్, విండో డైరెక్టర్లు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు సమ్మిరెడ్డి, మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్, పర్శ నాయక్, దేవీలాల్ పాల్గొన్నారు.