e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home కరీంనగర్ బీజేపీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతది

బీజేపీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతది

సీఎం కేసీఆర్‌ పాలనలో మున్నూరుకాపులకు అత్యధిక ప్రాధాన్యం
మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్‌

వీణవంక, సెప్టెంబర్‌ 9: బీజేపీకి ఓటేస్తే ని యోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని, దీని పై ప్రజలు ఆలోచన చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని దేశాయిపల్లి పీఎస్‌కే గార్డెన్స్‌లో జరిగిన మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి ఎందరో ప్రధానులు, సీఎంలు మారినా బీసీల బతుకులు మారలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ పాలనలో బీసీలు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నారన్నారు. పేదలకు అన్ని రకాలుగా సంక్షేమ ఫలాలు అందజేస్తున్న టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రతి కుల సంఘానికి క మ్యూనిటీ హాళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో విలువైన కోకాపేట వంటి ప్రాంతాల్లో 40 బీసీ కులాలకు అత్యద్భుతమైన భవనాలు నిర్మించుకుంటూ ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా నిలువాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్య ర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఓటేసి గెలిపించాలని కోరా రు. గతంలో అనేక పదవులు అనుభవించిన బీజేపీ నేత ఈటల రాజేందర్‌ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడేలేదని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధిని ఆయన గాలికి వదిలేశాడని, ఎకడ చూసినా గుంతలు, మట్టిరోడ్లు దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. రాజేందర్‌ గెలిస్తే రాజాసింగ్‌, రఘునందన్‌ పకకు మరో ఎమ్మెల్యేగా ఉంటాడని, కానీ హుజూరాబాద్‌ నియోజకవర్గం అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని, నిత్యావసరధరలు ఆకాశాన్ని అంటాయని, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచారని విమర్శించారు. ఇన్నేళ్లు పదవిలో ఉన్న ఈటల పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో ప్రజలకు చెప్పపాలని డిమాండ్‌ చేశారు. గోడ గడియారాలు, కుట్టుమిషన్లు, ప్రెషర్‌ కుకర్లు పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడని, ఆయన చేష్టలను నమ్మవద్దన్నారు. ఈటల నిర్లక్ష్యంతో వెనుకబడిన నియోజకవర్గంలో ప్రతి పనిని పూర్తి చేసే బాధ్యత తమదేనన్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పొనగంటి మల్లయ్య, నాయకులు ఏబూసి శ్రీనివాస్‌, మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పురంశెట్టి చేరాలు, బండారి ముత్తయ్య పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement