రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్
చందుర్తిలో ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్
విజేతలకు బహుమతులు అందజేత
రుద్రంగి(చందుర్తి), జనవరి 9: గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని, క్రీడలతో క్రమశిక్షణ పెరుగుతుందని, మానసిక, శారీరక ఉల్లా సం కలుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని హై స్కూల్ ఆవరణలో అనంతపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జువ్వాడి రామ్ గోపాల్‌రావు స్మారకార్థం నిర్వహిస్తున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు వేడుకకు వినోద్‌కుమార్ హాజరై బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి సిరిసిల్ల వాలీబాల్ అసోసియేషన్, రెండో బహుమతి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ జట్టుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ ప్రజలు చదువుతో పాటు క్రీడల్లోనూ వివక్షకు గురయ్యారన్నారు. గ్రామీణ యువత చెడు వ్యాసనాలకు అలవాటు పడుతున్నారని, తెలంగాణ ప్రభు త్వం పల్లె ప్రగతిలో భాగంగా యువత మంచి మార్గంలో నడిపేందుకు క్రీడా పోటీలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నదన్నారు. యువత ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తెలిపారు. మండల కేంద్రంలో మినీ స్టేడియం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, ఎంపీపీ బైరగోని లావణ్య, జడ్పీటీసీలు గట్ల మీ నయ్య, నాగం కుమార్, మార్కెట్ కమిటీ చైర్మెన్ పొన్నాల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మెన్ తిప్పని శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, సర్పంచ్‌లు సిరికొండ ప్రేమలత, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్రావు, వాలీబాల్ అసోసియేష న్ జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రం, నిర్వాహకు లు వెంకటేశ్వరరావు, నాయకులతోపాటు పీఈ టీలు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.