ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు
రాజన్నసిరిసిల్ల జిల్లా వెలమ సంక్షేమ మండలి పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరు
సిరిసిల్ల రూరల్ ,జనవరి 9: నిరుపేద వెలమ కుటుంబాలకు అండగా ఉంటామని ఆల్ ఇండి యా వెలమ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు భరోసానిచ్చారు. సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఆదివా రం నిర్వహించిన రాజన్నసిరిసిల్ల జిల్లా వెలమ సంక్షేమ మండలి ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన చిక్కాల రామారావుతో పాటు పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయించి సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎందరో వెలమ కులస్తులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని, వారికి వైద్యపరంగా, ఆర్థికంగా చేయూతనందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వారి పిల్లలకు స్కాలర్షిప్లు, హాస్టల్ వసతి కల్పించేందుకు తగిన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారి కోసం వృద్ధ్దాశ్రమం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. చిక్కాల రామారావు మాట్లాడుతూ, అందరిని కలుపుకొని పోయి సంఘం అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. మంత్రి కేటీఆర్ సహకారంతో సంఘ భవనానికి స్థలంతో పాటు, ఇతర సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన చల్మెడ లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ నిరుపేదల వెల్మలకు విద్య, వైద్యపరంగా చేయూతనందిస్తానని చెప్పారు. వెలమ సంక్షేమ సంఘ మాజీ అధ్యక్షుడు చీటి నర్సింగరావు మాట్లాడుతూ పాలకవర్గానికి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులు పాలకవర్గంతో పాటు అతిథులను ఘనంగా సన్మానించారు. కాగా, ముస్తాబాద్ మండలం రాంరెడ్డిపల్లెకు చెందిన గన్నమనేని వెంకటేశ్వర్రావు కూతురు సంజన ఎంబీబీఎస్‌లో ఆల్ ఇండియా 165 ర్యాంకు సాధించగా, ఘనంగా జ్ఞాపికను అందించి సన్మానించారు. సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఇక్కడ టీఎస్పీఎస్సీ సభ్యుడు ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ సభ్యులు గన్నమనేని కృష్ణ, ప్రవీణ్‌రావు, ఆశోక్‌రావు, రాంమోహన్‌రావు, ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రా మారావు, జూపల్లి నాగేందర్రావు, గండ్ర యా దగిరిరావు, తాండ్ర రవీందర్రావు, బైరి నేని రాము, శ్రీనివాస్‌రావు, లక్ష్మణ్‌రావు ఉన్నారు.
అట్టహాసంగా ప్రమాణ స్వీకారం..
జిల్లా వెలమ సంక్షేమ మండలి పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అధ్యక్షుడు చిక్కాల రామారావు, ప్రధాన కార్యదర్శి గుజ్జునేని వేణుగోపాలరావు, ఉపాధ్యక్షులుగా సురభి దశరథ్రావు, చీటి నర్సింగరావు, బాలన్నగారి మేఘమాల, కోశాధికారిగా బొంత వేణుగోపాలరావు, సంయుక్త కార్యదర్శులుగా కడపత్రి అనిల్‌రావు, నాయిని కిరణ్‌రావు, ప్రచార కార్యదర్శిగా అయిలేన్ని పాపారావు, కార్యవర్గ సభ్యులు కారంగుల వెంకటరావు, సురభి ప్రదీప్‌కుమార్, సంకినేని సందీప్‌రావు ,మట్టపల్లి భూపతిరావు, చీటి గీత ప్రమాణం చేశారు.