చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
రామడుగు మండల సర్వసభ్య సమావేశానికి హాజరు
రామడుగు, జనవరి 8: పంటసాగు కోసం బడుగు బలహీన వర్గాల రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథకం చరిత్రలో నిలిచిపోతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నదన్నారు. ఏ రాష్ట్రంలో లేని పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలను అందించడం ఆయన సుపరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. అంతకుముందు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన రైతుబంధు సంబురాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. సర్వ సభ్య సమావేశంలో భాగంగా ఆయా శాఖల అధికారులు గత మూడు నెలల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కలిగేటి కవిత, జడ్పీటీసీ మార్కొండ లక్ష్మి, తహసీల్దార్ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో ఎన్ఆర్ మల్హోత్రా, సీడీపీవో కస్తూరి, ఏవో యాస్మిన్, పీఆర్ ఏఈ సచిన్, ఏపీవో రాధ, ఏపీఎం ప్రభాకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బండ అజయ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.