చొప్పదండి, నవంబర్ 6: రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి, ఆర్నకొండ ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో మండలంలోని వెదురుగట్ట, చాకుంట, రుక్మాపూర్, ఆర్నకొండ, రాగంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్నదాతలు అధైర్యపడొద్దని, ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఐకేపీ, సహకార సంఘాలు, మార్కెటింగ్ శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు ధాన్యం దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.1960, బీ-గ్రేడ్ ధాన్యం రూ.1940 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్‌విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, తిరుపతిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, సర్పంచులు పెద్ది శంకర్, చిలుక లింగయ్య, దామెర విద్యాసాగర్‌రెడ్డి, మామిడి లత, ఎంపీటీసీలు పెంచాల రమ్య, గోపు మంగ, గొల్ల సునంద, మండల వ్యవసాయాధికారి వంశీకృష్ణ, సింగిల్‌విండో డైరెక్టర్లు సత్తు నర్సయ్య, మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెట్టిపల్లి పద్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు గుడిపాటి వెంకటరమణారెడ్డి, యువరాజ్, రాజేశం, శ్రీనివాస్, రంగన్న, మహేశ్, అంజయ్య, నరేందర్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.