ధర్మారం, డిసెంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు గ్రామంలోని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరిస్తామని ధర్మారం మండలం పత్తిపాక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధు లు, నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం సర్పంచ్ బద్దం సుజాత, సింగిల్ విండో చైర్మన్ నోముల వెంకట్ రెడ్డి, డైరెక్టర్ బద్దం రవీందర్ రెడ్డి, ఆర్బీఎస్ కోఆర్డినేటర్ కోయెడ రవీందర్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కటికెనపల్లి సురేశ్, నాయకులు కోల శ్రీనివాస్,జిల్లెల రాజు, పొలాస మల్లేశం,యూత్ సభ్యులు గుండా నితీశ్, సింగిరెడ్డి వంశీ రెడ్డి తదితరులు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని వివరించారు. రైతుల కోసం నీటి ప్రాజెక్టులు నిర్మించి సాగునీటిని సరఫరా చేస్తుండడంతోపాటు వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ను ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతులు మరణిస్తే రూ. 5 లక్షల బీమా ద్వారా పరిహారం చెల్లిస్తున్నారని వారు తెలిపారు. ఈ పథకాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తామని వారు పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషితో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. గ్రామానికి ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణానికి మంత్రి నిధులు మంజూరు చేసి రైతుల దశాబ్దాల కలను నెరవేర్చారని గుర్తు చేశారు. త్వరలో పనులు ప్రా రంభమవుతాయని తెలిపారు. మంత్రి నిధులు మంజూరు చేయడంతో బ్రాహ్మణ్లకుంట మత్తడి వద్ద చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తికావచ్చిందని వారు వివరించారు. మంత్రి, మండల ప్రజా ప్రతినిధుల కృషితో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. పార్టీని గ్రామంలో మరింత బలోపేతం చేస్తామన్నారు. తమకు పదవులు అప్పగించిన అమాత్యుడికి కృతజ్ఞతలు తెలిపారు.