e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home కరీంనగర్ హుజూరాబాద్‌ అభివృద్ధి బాధ్యత నాదే

హుజూరాబాద్‌ అభివృద్ధి బాధ్యత నాదే

సీఎం ఆదేశాల మేరకు అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతా
రైతు బంధు మాదిరి దళిత బంధు సూపర్‌ సక్సెస్‌ అవుతుంది
ఈటల ఆరుసార్లు గెలిచినా చేసింది శూన్యం
బీజేపీతో ఒరిగేదేం లేదు.. ఆ పార్టీకి ఓటేస్తే ప్రమాదమే
కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

మంత్రి గంగుల కమలాకర్‌
ఇప్పల్‌నర్సింగాపూర్‌, బోర్నపల్లిలో మార్నింగ్‌ వాక్‌

హుజూరాబాద్‌రూరల్‌, ఆగస్టు 4: హుజూరాబాద్‌ అభివృద్ధి బాధ్యత తనదేనని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలో తీర్చిదిద్దుతానని, ప్రజా సమస్యలు పరిషరిస్తానని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఏం చేసిండని.. ఆయన్ను ఆరుసార్లు గెలిపించినా ప్రయోజనం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, ధరల భారం మోపడంతోపాటు రాష్ట్ర సర్కారు ఉచితంగా ఇస్తున్న కరెంట్‌కు కూడా మోటార్లు పెట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచి పేదోడి నడ్డివిరుస్తున్నదని, స్థానిక ప్రజలే బీజేపీ వైఖరిని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఇలాంటి టైంలో మనం ఓటు వేస్తే ప్రస్తుతం వెయ్యి ఉన్న సిలిండర్‌ ధరను 2వేలు చేస్తుందని, 100 పెట్రోల్‌ను 200 చేస్తుందని మండిపడ్డారు. బుధవారం హుజూరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పల్‌నర్సింగాపూర్‌, బోర్నపల్లి గ్రామాల్లో మార్నింగ్‌ వాక్‌ చేశారు. గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యలపై చర్చించారు. కాగా, హుజూరాబాద్‌ అభివృద్ధిలో కొంత వెనుకబడి ఉందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తెచ్చారు.
గ్రామస్తుల విన్నపాలు..
మార్నింగ్‌ వాక్‌ సమయంలో అభివృద్ధిలో హుజూరాబాద్‌ కొంత వెనుకబడి ఉందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తెచ్చారు. చిలుక వాగుపై బ్రిడ్జి నిర్మాణం, పెద్దమ్మ, బీరప్ప ఆలయాలు, ఇతర అభివృద్ధి పనులు చేయాలని, కొత్త పింఛన్లు ఇప్పించాలని కోరారు. బోర్నపల్లిలోని అమ్మనగుర్తికి వెళ్లే దారిలో వంతెన కావాలని విన్నవించగా, మంత్రి స్పందించారు. వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తానని హమీ ఇచ్చారు. కాగా, ఒక మంత్రి తమ దగ్గరికి వచ్చి మాట్లాడి, సమస్యలు పరిషరిస్తానని హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు.
అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా..
హుజూరాబాద్‌ అభివృద్ధి బాధ్యత తనేదనని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎకడ అభివృద్ధి కుంటుపడిందో అకడ తీసుకోవాల్సిన చర్యల గురించి, ప్రజలు కోరుకుంటున్న వాటిని నెరవేర్చాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేస్తుంటే హుజూరాబాద్‌ మాత్రం ఇంత వెనుకబడి ఉండడం బాధ కలిగిస్తున్నదని చెప్పారు. ఈ గడ్డపై ప్రారంభించిన రైతు బంధు ఎలా సక్సెస్‌ అయిందో, దళిత బంధూ అదే రీతిలో సక్సెస్‌ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. అయితే పథకాలన్నీ ఎన్నికల కోసమే తెచ్చామని బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈటల మంత్రిగా ఉన్నప్పుడే ఈ నిర్ణయం జరిగిందని, ఈ విషయం ఆయనకు కూడా తెలుసునన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ఎన్నికలతో సంబంధం లేకుండా రాష్ట్ర సర్కారు పనిచేస్తుందని వివరించారు. దేశంలోనే ఎక్కడా లేని పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని, అభివృద్ధిలోనూ తెలంగాణ ముందున్నదని చెప్పారు. హుజూరాబాద్‌ నగర అభివృద్ధితో పాటు సబ్బండ వర్గాలను అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నామని, ఇన్ని చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధికాశ్రీనివాస్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల శ్రీనివాస్‌, కరీంనగర్‌ మేయర్‌ వై సునీల్‌రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు దొంత రమేశ్‌, చందమల్ల బాబు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

- Advertisement -

చిలుక వాగు మీద బ్రిడ్జి కావాలె..
మేం పొలంకాడికి పోవాలంటే బాట మంచిగా లేక ఇబ్బంది పడుతున్నం. రెండు కిలోమీటర్ల దూరంగా మా బాయిలుంటయి. బాట సక్కగా లేదు. బ్రిడ్జిలేదు. చిలుక వాగుమీద బ్రిడ్జి వేయండి సారు.. మీ మేలు ఎప్పటికీ మరిచిపోం. పిల్లలను ఏసుకోని పోతుంటే ఇబ్బందవుతుంది. వర్షం కొడితే వాగు దాటనిత్తలేదు. గొడ్డూగోద పోవాలన్న తిప్పలవుతుంది. మొన్న వర్షం కొడితే ఐదు రోజులు ఇంటికాన్నే ఉన్నం. బ్రిడ్జి కట్టాల్నని ఎంత మందికి చెప్పినా పట్టించుకోలె. కానీ, మా ఊరికి అచ్చిన గంగుల కమలాకర్‌ సర్‌కు మా బాధ చెప్పుకున్నం. గాబ్రిడ్జి ఇస్తే మీ మేలు మరిచిపోం అని అడుగంగనే కట్టిత్తా అన్నడు. వారం పదిరోజుల్ల పనులు మొదలుపెడుతా అన్నడు. మేము మొదటి సంది కేసీఆర్‌ సారుతోటే ఉన్నం. ఇప్పుడు కూడా సారుతోనే ఉంటం.

  • గోస్కుల సులోచన, ఇప్పలనర్సింగాపూర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana