జగిత్యాల రూరల్, నవంబర్ 3: అర్హులందరికీ పారదర్శంగా గొర్రెల పంపిణీ చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఉద్ఘాటించారు. గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం గొల్లపల్లెలో బుధవారం ఏర్పాటు చేసిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌తో దావ వసంతతో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకేంద్రంలోని గీతా భవన్లో 45 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని చల్గల్లో పలు కుల సంఘాల భవనాలకు భూమిపూజ చేశారు. ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని 111మంది లబ్ధిదారులకు 22 యూనిట్లలో 2 వేల ఆడ గొర్రెలు, 104 పొట్టేళ్లను పంపిణీ చేశామని చెప్పారు. ఇందుకు సర్కారు రూ. 1.80 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఒక్కో యూనిట్ విలువ రూ.1.75 లక్షలు కాగా ప్రభుత్వ సబ్సీడీ రూ.1,31,250 పోను లబ్ధ్దిదారులు రూ.43,750లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వెల్దుర్తిలో శిథిలావస్థలో ఉన్న పశు వైద్యశాల అభి వృద్ధికి రూ.4 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నిజమాబాద్ ఎంపీ అర్వింద్ నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలి పేస్బుక్, ట్విట్టర్లోనే కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. గొల్లకుర్మల ఆరాధ్య దైవం కేసీఆర్ అని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు కూసరి అనిల్, పిట్ట ధర్మరాజు, క్యాదాసు నవీన్, జుంబర్తి రాజు, కూతురు రాజేష్, బొడ్ల జగదీష్, కోరె గంగమల్లు, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ భిక్షపతి, డీడీ ఈ శ్రీధర్, మండల పశు వైద్యాధికారి డాక్టర్ నరేశ్‌రెడ్డి, ఇన్చార్జి ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ దామోదర్‌రావు, వెల్దుర్తి సర్పంచ్ బుర్ర ప్రవీణ్ గౌడ్,, ఉప సర్పంచ్ తిరుపతి, మాజీ సర్పంచ్ ఆనంద రావు, మాజీ ప్యాక్స్ చైర్మన్ సదాశివరావు, ఫ్యాక్స్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, ఆర్బీఎస్ చైర్మన్ నక్క రవీందర్ రెడ్డి, సర్పంచ్ ఎల్ల గంగనర్సు, రాజన్న, ఉప సర్పంచ్ నలువాల పద్మ, మాజీ ఉప సర్పంచ్ సత్యం, మాజీ ఎంపీటీసీ పోచమల్లు గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.